కేంద్ర మంత్రులకు కొల్లు రవీంద్ర కీలక వినతులు

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra).. పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ పనులపై చొరవతీసుకుని పూర్తి చేయాలని విన్నవించారు. తొలుత కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)ని ఢిల్లీలోని వారి కార్యాలయంలో మంత్రి కలిశారు. మచిలీపట్నం-బంటుమిల్లి మధ్య 20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరారు. కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ధి, రాష్ట్ర పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా రోడ్డును అభివృద్ధి చేయాలని వినతిపత్రం అందజేశారు.

రక్షా నిఖిల్ ఖడ్సేతో భేటీ..

అనంతరం కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే(Raksha Khadse)ని వారి కార్యాలయంలో మంత్రి రవీంద్ర (Kollu Ravindra) మర్యాదపూర్వకంగా కలిశారు. రూ.17 కోట్లతో మచిలీపట్నంలో ఇండోర్ స్టేడియం, రూ.9 కోట్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఖేలో ఇండియా ద్వారా తోడ్పాటు అందించాలని వినతిపత్రం అందించారు. వీటి నిర్మాణంతో మచిలీపట్నంలో జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌ల నిర్వహణకు అవకాశాలు మెరుగు పడతాయని.. వీటిని పూర్తి చేయాలని కోరారు.

గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశం..

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీలోని వారి కార్యాలయంలో కొల్లు రవీంద్ర కలిశారు. మచిలీపట్నంలో పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.120 కోట్ల ఆర్ధిక సాయం అందించాలని వినతిపత్రం అందించారు. కేంద్ర సహకారంతో మచిలీపట్నంలో పర్యాటకం, వారసత్వ పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యాలకు గణనీయంగా తోడ్పడే ఒక మోడల్ తీరప్రాంత పర్యాటక గమ్యస్థానంగా బందరు మారుతుందని.. దీనికి సహకరించాలి కోరారు. అలాగే ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటాను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూలంకషంగా చర్చించారు.

రాజ్‌భూషణ్ చౌదరితో భేటీ..

కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరిని ఢిల్లీలో మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. మచిలీపట్నం తీరప్రాంతంలోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా కృష్నా నది సముద్రంలో కలిసే ప్రాంతంలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. తీర ప్రాంతంలో మంచినీటి సరఫరా నిరంతరం అందేలా చూడాలని, మత్స్యకారుల జీవనోపాధిని కాపాడటానికి, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థను సంరక్షించడానికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బాపట్ల ఎంపీ తిన్నేటి కృష్ణ ప్రసాద్ ని ఢిల్లీలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోస్టల్ హైవే ప్రాజెక్ట్, ఏపీ తీరప్రాంత రూపురేఖలను మార్చడం, ప్రాజెక్ట్ ప్రయోజనాలు, మచిలీపట్నం వరకు విస్తరించడంపై సుదీర్ఘంగా చర్చించారు.

Read Also: కుంకీ ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>