నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ సంచలన చార్జ్‌షీట్ దాఖలు!

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ (NEET Paper Leak ) కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కుట్రలో ప్రత్యక్షంగా భాగస్వాములైన 13 మంది నిందితులపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసిన 13 మంది నిందితుల్లో ముగ్గురు ఎన్టీయే సబ్జెక్ట్ నిపుణులున్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్ పై కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, నీట్ ప్రవేశాల కోసం మే 3న జరిగిన పరీక్షలో అక్రమాలు జరిగినట్లు కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. 92 చోట్ల సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అకౌంట్లు, లాకర్లు, డీమ్యాట్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>