ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టుకు జలకళ

కలం, మెదక్ బ్యూరో : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, ఎగువ ప్రాంతాల నుంచి మంజీరా నదిలోకి వరద నీరు పోటెత్తడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లోని వనదుర్గ (Edupayala Vanadurga) ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో ప్రాజెక్టు అలుగు పారి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి.

వనదుర్గ ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో స్థానిక రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో పాటు, వరి నాట్లకు, అలాగే ఇతర పంటలకు నీటి కొరత తీరుతుందని ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>