కలం, నిర్మల్: పూజలు చేసి వ్యాధులు నయం చేస్తామని నమ్మించి చోరీకి పాల్పడిన ఇద్దరు మహిళలను భైంసా రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ మంగళవారం తెలిపారు. నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా మండలం కోతలుగాం గ్రామానికి చెందిన చందూర్ దత్తాత్రేయ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి పరిస్థితిని ఆసరాగా చేసుకున్న భైంసా పట్టణానికి చెందిన సాయవ్వ, శాంతాబాయి అనే మహిళలు పూజలు చేసి వ్యాధిని నయం చేస్తామని నమ్మించారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న రూ.15 వేలతోపాటు వెండి కడియాలను అపహరించినట్లు తెలిపారు.
మోసాన్ని గుర్తించిన బాధితులు భైంసా రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై సుప్రియ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు సీఐ తెలిపారు.

