పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలి: విజయలక్ష్మి

కలం, జగిత్యాల: జిల్లా కేంద్రంలోని (Jagtial) పొన్నాల గార్డెన్‌లో ఇమిటేషన్ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ మార్కెటింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రియాక రెడ్డి (Priyaka Reddy) నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా శిక్షణార్థులకు వివిధ రకాల ఇమిటేషన్ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ తయారీ, డిజైనింగ్, మార్కెటింగ్ మెళకువలపై నిపుణుల ద్వారా సైద్ధాంతిక, ప్రాయోగిక శిక్షణ అందించారు. శిక్షణ అనంతరం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి (Thatiparthi VijayaLaxmi) హాజరై, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన శిక్షణార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు నైపుణ్యాన్ని పెంపొందించుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇమిటేషన్ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ రంగంలో ప్రస్తుతం మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని, శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని ఇంటి నుంచే ఉపాధి ప్రారంభించవచ్చని తెలిపారు. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించుకుంటే తమ ఉత్పత్తులను విస్తృత స్థాయిలో మార్కెట్ చేయడంతో పాటు మెరుగైన ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఇలాంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి.. ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరిస్తాయని ఆమె అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టి విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని శిక్షణార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించిన శిక్షణ సంస్థ నిర్వాహకులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజర్ ప్రియాంక, ట్రైనర్ స్వాతి తో మహిళా శిక్షణార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>