కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కోర్సులపై చర్చించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఆసుపత్రులలో మందుల వివరాలు, స్టాక్ అందుబాటులో ఉంచాలని, కొరత ఉంటే దృష్టికి తీసుకురావాలని మంత్రి దామోదర సూచించారు.
రేడియాలజీ విభాగం ఆసుపత్రికి కొంత దూరంలో ఉన్నందున హాస్పిటల్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. నూతనంగా రూ.235 కోట్లతో నిర్మిస్తున్న 450 పడకల ఆసుపత్రి త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మెడికల్ కాలేజీ, హాస్టల్, పనులు 9వ నెలలోపు పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రికి నూతన అంబులెన్స్, విద్యార్థులకు బస్సు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
పాత బస్టాండ్ హాస్పిటల్ లో వెల్ నెస్ సెంటర్ కోసం రూ.2 కోట్ల నిధులు, మాతా శిశు ఆసుపత్రి ప్రారంభం రోజున ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) తెలిపారు. అలాగే జగిత్యాల పాత బస్టాండ్ లో ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. జగిత్యాల రాయికల్ వైద్య ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిపై చర్చించడం జరిగిందని అన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి పల్లె దవాఖానాలు, బీద మధ్యతరగతి ప్రజలు నివసించే అర్బన్ కాలని, నూకపల్లిలో బస్తీ దవాఖాన మంజూరు చేయాలని కోరగా.. మంత్రి (Damodar Raja Narasimha) సానుకూలంగా స్పందించారని సంజయ్ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, డీఎంఈ శివరాం ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వివిధ శాఖల అధికారులు, మెడికల్ కాలేజీ సూపరిండెంట్ కృష్ణ మూర్తి, డీసీహెచ్ఎస్ డా.రామకృష్ణ, డీఎంహెచ్ఓ డా.సుజాత, వైద్య అధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: కాజీపేట డివిజన్ సాధించే వరకు పోరాటం ఆగదు: దాస్యం వినయ్ భాస్కర్
Follow Us On : WhatsApp

