నిజాంసాగర్ లోకి స్వల్ప వరద ప్రారంభం

కలం, నిజామాబాద్ బ్యూరో : ఎగువ ప్రాంతాల్లో రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar Project) లోకి స్వల్ప వరద ప్రారంభమైంది. 899 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. 1,394.48 అడుగుల (6.489 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో వరద రావడం లేదు. దీంతో ఆయకట్టు రైతాంగం ఆందోళనకు గురవుతోంది.. వర్షాలు బాగా కురిసి వరద పెద్ద ఎత్తున వచ్చి ప్రాజెక్టు నిండుకుండలా మారాలని రైతన్నలు ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>