కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో అప్పపీడం తీవ్రవాయుగుండంగా మారి ఉత్తర దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఏపీలో మంగళవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Update) వెల్లడించింది.
సముద్రతీర ప్రాంతాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఉభయగోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని సూచించింది.
మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్డ్ జారీ చేసింది.

