కలం, వెబ్ డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (Pavala Shyamala) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
అర్ధరాత్రి ఒంటి గంటా యాభై రెండు నిమిషాల సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పావలా శ్యామల మరణవార్త తెలిసి టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పలువురు సినీ నటీనటులు, దర్శకులు సంతాపం ప్రకటిస్తున్నారు.

