కలం, యాదగిరిగుట్ట: ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జికి నిరసనగా యాదగిరిగుట్ట (Yadagirigutta)లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల (వైకుంఠ ద్వారం) నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో మున్సిపల్ ఛైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కౌన్సిల్లర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరీక్షల నిర్వహణలో విఫలం..
ఈ సందర్భంగా విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటనతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని వివరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జి చేయడం దారుణమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

