సీఎం విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టులో భారీ షాక్..!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాటలో (Karur Stampede) మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని మద్రాస్ హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పంచి పెట్టేది కాదని, అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. బస్సు ప్రమాదాల్లో మరణించినవారి కుంటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇస్తారా? అని తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంటూ.. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తూ టీవీకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది.

గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‍లో టీవీకే అధినేత, ప్రస్తుత సీఎం విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల తన కరూర్ పర్యటనలో భాగంగా సీఎం విజయ్ స్వయంగా బాధితుల కుటుంబాలకు చెందిన 31 మందికి ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. అయితే ఈ నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని తేల్చింది. బాధితుల కుటుంబాలకు నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి బదులుగా వారు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేలా నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శిక్షణ వంటివి అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వానికి సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>