సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలుచేయండి!

కలం, కరీంనగర్ బ్యూరో: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) డిమాండ్ చేసింది. ‘జన జాగరణ’ లో భాగంగా సోమవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ​ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తన మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

3-4 వేలతో ఎలా బతకాలి: స్థితప్రజ్ఞ

టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడారు. జూలై 11న ప్రారంభించిన జన జాగరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటిస్తున్నామన్నారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలను కలుస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 60 వేల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఏకైక ఆకాంక్ష పాత పెన్షన్ పునరుద్ధరణేనని తేల్చిచెప్పారు. ​ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. సీపీఎస్ విధానం వల్ల రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కేవలం రూ.3,000 నుంచి రూ.4,000 మాత్రమే పెన్షన్ వస్తోందని, దీంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ వివిధ స్థాయిల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>