అబ్దుల్ కలాం ఆశయాలతో యువత ముందుకు సాగాలి!

కలం, కరీంనగర్: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) 11వ వర్ధంతి వేడుకలు జరిగాయి. సోమవారం ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్‌లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఆమీర్ మాట్లాడుతూ.. డాక్టర్ అబ్దుల్ కలాం డీఆర్‌డీవో, ఇస్రో సంస్థల్లో విశిష్ట సేవలు అందించి భారతదేశ రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. “మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా”గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కలాం, రాష్ట్రపతిగా “పీపుల్స్ ప్రెసిడెంట్”గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు.

నేటి యువత, విద్యార్థులు అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు. ఆయన ఆశయాలు, విలువలను కొనసాగిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల–కిరణ్ కుమార్, పిల్లి లక్ష్మణ్, తుమ్ నారాయణ, అబ్దుల్ రెహమాన్, సాగర్, మేరాజ్, రమేశ్, ప్రవీణ్, రాజశేఖర్, అక్బర్, మల్లికార్జున్, వెంకటేశ్, అక్షయ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>