కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీరుపై కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని చెప్పి, ఉల్లంఘిస్తున్నారని మండిపడింది. ఈ మేరకు సీజేపీ నాయకుడు అశుతోష్ రంకా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌కు లేఖలు రాశారు. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో తమ వారిని పోలీసులు అరెస్ట్ చేసి, ఇబ్బంది పెడుతున్నట్లు వారికి వివరించారు.

వదిలిపెట్టకపోతే ఉద్యమిస్తాం..

ఢిల్లీలో తమ కార్యకర్తలపై పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నారని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపించింది. కేంద్ర మంత్రుల సమక్షంలో జరిగిన ఒప్పందానికి ఇది పూర్తి వ్యతిరేకమన్నారు. వెంటనే తమ కార్యకర్తలను వెంబడించడం ఆపేసి, ఇప్పటికే అరెస్ట్ చేసినవారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేసింది. స్పందించకపోతే.. మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>