కలం, నిర్మల్: దేశవ్యాప్తంగా గోవధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ (Gau Samman Aahvaan Abhiyan) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ (Cow Protection Rally) నిర్వహించారు. శివాజీ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
దేశంలో గోమాతకు సముచిత స్థానం కల్పిస్తూ గోవధను పూర్తిగా నిషేధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రతి గ్రామంలో గోశాలలు ఏర్పాటు చేయాలన్నారు. గోవుల పరిరక్షణ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో కీలకమైన అంశమని, గోమాత సంరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గో సన్మాన్ అభియాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

