నిరుపేద కుటుంబాలకు ఆసరాగా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన బొంపాల రాహుల్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో, ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ.3 లక్షల ఎల్ఓసీ చెక్కును బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందని అన్నారు. చెక్కు మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్ఓసీ ద్వారా ఇప్పటివరకు రాహుల్ వైద్య చికిత్స కోసం మొత్తం రూ.6.50 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>