కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి డ్రగ్స్ అమ్మకాలు కలకలం రేపాయి. అబిడ్స్‌లో పరిసర ప్రాంతంలో తరచూ డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, ఇతర పోలీస్ సిబ్బంది సోమవారం ఉదయం అబిడ్స్‌లో కాపు కాశారు. బెలినో కారులో వచ్చిన ఓ వ్యక్తికి మరో వ్యక్తి ఓ డ్రగ్స్ ప్యాకెట్ ఇవ్వడం గమనించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
కారులో ఉన్న సైఫ్ అనే వ్యక్తిని కారు దిగాలని పోలీసులు సూచించారు. ఇంతలో సైఫ్ కారు పార్క్ చేస్తున్నట్లు నటించి స్పీడ్‌గా అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో కారు ముందున్న సీఐ, కానిస్టేబుల్‌కి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు సైఫ్ కారును ఛేజ్ చేసి పట్టుకున్నారు. సైఫ్‌ని అదుపులోకి తీసుకొని అతడిపై హత్యా యత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ సీఐ, కానిస్టేబుల్‌కి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

