నేడు లోక్‌సభ ముందుకు కీలక బిల్లు

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభ (Lok Sabha) సమావేశాల ముందు కీలక బిల్లుపై సోమవారం చర్చ జరుగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పేపర్ లీకేజీపై ఇటీవల హింసాకాండ చోటు చేసుకున్న తరుణంలో పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా చట్టంలో కీలక సవరణలు చేయనున్నారు. సాధారణ అక్రమాలకు పాల్పడితే జైలు శిక్ష 5 నుంచి 10 ఏళ్లకు పెంచడంతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించే దిశగా చట్టం చేయనున్నారు. వ్యవస్థీకృత ముఠాలు, పేపర్ లీక్ గ్యాంగ్‌లకు గరిష్టంగా రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా వేయనున్నారు.

కేసు నమోదైన 2 నెలల లోపే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం తప్పనిసరి చేస్తూ.. కేసుల శరవేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేయనున్నారు. ఛార్జ్‌షీట్ దాఖలైన 3 నెలలలోనే విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించే దిశగా రూల్ తీసుకురానున్నారు.అలాగే వందేమాతరం గీతానికి జాతీయ హోదా కల్పించే అంశంపై నేడు రాజ్యసభలో చర్చ జరగనుంది. గతంలో కొందరు ఎమ్మెల్యేలు వందేమాతర గీతం సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో నుంచి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా.. దేశానికి ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు.. దేశాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>