కరీంనగర్‌ పోలీసుల కృషి.. మంగళసూత్రం అప్పగింత

కలం, కరీంనగర్: కరీంనగర్‌ (Karimnagar) పోలీసుల కృషితో పోగొట్టుకున్న మంగళసూత్రం తిరిగి బాధితురాలికి చేతికి వచ్చింది. సీడీపీవోగా పనిచేస్తున్న సిగిరి శ్రీలత ఇటీవల ఓ బంగారు ఆభరణాల షోరూమ్‌కు షాపింగ్ కోసం వచ్చారు. ఈ క్రమంలో తన 2.5 తులాల బంగారు మంగళసూత్రాన్ని రోడ్డుపై పోగొట్టుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.

అలా రెండు రోజుల పాటు పరిశీలించి, 2.5 తులాల బంగారు మంగళసూత్రం పడిపోయిన ప్రదేశాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితురాలు శ్రీలతకు అప్పగించారు. దర్యాప్తులో కృషి చేసిన క్రైమ్ టీం కానిస్టేబుళ్లు సాయికిరణ్, అజయ్ కుమార్‌ను టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>