పరారీలో ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ : మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్​ ఉదయ్‌కృష్ణా రెడ్డిపై (Uday Krishna Reddy) పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేసు నమోదు చేసిన అనంతరం ఉదయ్‌కృష్ణారెడ్డికి నోటీసులు అందజేయడానికి పోలీసులు గత రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో ఆయనకు సంబంధించిన రెండు చిరునామాలకు వెళ్లగా, అక్కడ ఆయన ఆచూకీ లభించలేనట్లు తెలుస్తోంది.

నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉదయ్‌కృష్ణ ఎక్కడ ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>