కలం, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలం కొండాపురం (Kondapuram) గ్రామ సర్పంచ్, జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కొప్పుల వెంకట్ రెడ్డి జాతీయ ఉత్తమ సర్పంచ్ 2026 అవార్డు అందుకున్నారు.
హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో జాతీయ ఉత్తమ సర్పంచ్ 2026 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఏకగ్రీవంగా సర్పంచ్ పదవి బాధ్యతలు తనకు అప్పజెప్పారని అన్నారు.
గ్రామంలో వంతెన నిర్మాణం కోసం మంత్రిని కలిసి నిధులు మంజూరు చేయించామని త్వరలోనే వంతెన నిర్మాణం పూర్తి చేసి ఆరు గ్రామాల ప్రజల కల నెరవేరుస్తున్నామని తెలిపారు. జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు అందజేసిన నేషనల్ బహుజన సాహిత్య అకాడమీ సంస్థ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.

