కలం, నిర్మల్: ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ (MLA Pawar Ramarao Patel)ను ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. రావాల్సిన పీఆర్సీ బకాయిలను చెల్లించేలా.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించాలని కోరారు.
తమకు రావాల్సిన అలవెన్సులు, పీఆర్సీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేయడంతో పాటు రిటైర్డ్ ఉద్యోగి దంపతులకు లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.
అసెంబ్లీలో ప్రస్తావిస్తా..
వినతిపత్రం స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే (MLA Pawar Ramarao Patel) మాట్లాడుతూ.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి వివరిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Read Also: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్.. భూ సేకరణ షురూ!
Follow Us On : WhatsApp

