‘సర్‌’లో ఒక్క ఓటు మిస్ కావొద్దు: శ్రీహరి రావు

కలం, నిర్మల్: భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు ఓటు అని కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) అన్నారు. సర్ ప్రక్రియలో ఒక్క ఓటు మిస్ కాకుండా బూత్ లెవల్ సూపర్వైజర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బీఎల్ఎస్, బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు.

ప్రతి ఓటరు వద్దకు..

ప్రతి ఓటును కీలకంగా భావించి ప్రతి ఓటరు వద్దకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను నింపించి, బూత్ లెవల్ అధికారికి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని శ్రీహరి (Kuchadi Srihari Rao) రావు సూచించారు. సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా అన్యాయంగా తొలగిపోకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

ప్రతి అర్హత ఓటరు వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేలా కృషి చేయాలని శ్రీహరి రావు కోరారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు గాజుల రవికుమార్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, బీఎల్ఎస్, బీఎల్ఏలు పాల్గొన్నారు.

Read Also: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్.. భూ సేకరణ షురూ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>