చండూరు శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా గీతా మహాయజ్ఞం

కలం, చండూరు: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చండూరు (Chandur) పట్టణంలోని పురాతన, ప్రాచీన శివాలయమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మద్భగవద్గీతా మహాయజ్ఞం అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలి ఏకాదశి మహోత్సవంలో భాగంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం గీతా మహాయజ్ఞాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

ఈ యజ్ఞంలో స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమం అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులందరూ కలిసి సామూహిక గీతా పారాయణం చేశారు. పారాయణంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో పరవశించింది. కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ధర్మకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>