కామన్వెల్త్ గేమ్స్‌లో బాక్సర్ సచిన్ శివాచ్.. పతకమే లక్ష్యం!

క‌లం, వెబ్‌డెస్క్‌: భారత అగ్రశ్రేణి ఔత్సాహిక బాక్సర్ సచిన్ శివాచ్ (Sachin Siwach) గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో తన పోరాటాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం భారత్‌కు బలమైన పతక విజేతగా ఆయన బరిలోకి దిగుతుండటంతో క్రీడాభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత రెండు సీజన్లుగా అంతర్జాతీయ స్థాయిలో 26 ఏళ్ల సచిన్ అద్భుత ప్రదర్శన చేస్తూ వస్తున్నారు. 2025 ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత పురుష బాక్సర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు.

అదే జోరును 2026లోనూ కొనసాగించారు. చెక్ రిపబ్లిక్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్, స్పెయిన్‌లో జరిగిన బాక్సమ్ ఎలైట్ టోర్నీల్లో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి తన సత్తా చాటారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తనకు అతిపెద్ద గౌరవమని సచిన్ తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడటం ప్రతి అథ్లెట్ కల అని పేర్కొన్నారు.

తన రింగ్ మూవ్‌మెంట్స్, వేగం, టైమింగ్‌లను మెరుగుపరుచుకోవడంపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని, అందుకే మ్యాచ్‌లను ఒకదాని తర్వాత ఒకటిగా ఎదుర్కొంటూ ము ముందుకు సాగుతానని వివరించారు. ఈ ప్రయాణంలో ఇన్‌స్పైర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (IIS) అందించిన కోచింగ్, రికవరీ సదుపాయాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని సచిన్ కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>