రాష్ట్ర వ్యాప్తంగా జన జాగరణ యాత్ర

కలం, కరీంనగర్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న జన జాగరణ యాత్ర (Jana Jagarana Yatra) పోస్టర్‌ను కరీంనగర్‌లో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

టీఎన్జీవోల సంఘం మద్దతు..

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలనే డిమాండ్‌కు టీఎన్జీవోల సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జన జాగరణ యాత్ర ద్వారా సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి మరింత బలంగా తెలియజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్ రావు, కేంద్ర సంఘం నాయకులు సర్దార్ హర్మేందర్ సింగ్, పట్టణ సంఘం అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, నాయకులు, రాజశేఖర్, కరుణాకర్, నజీర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>