కాంగ్రెస్ హయాంలో 53 లీకులు.. ఒక్క మంత్రైనా రిజైన్ చేశారా?: రాంచందర్ రావు

కలం, వెబ్ డెస్క్: బీజేపీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 53 పేపర్ లీకులు అయ్యాయని.. వాళ్ళ హయాంలో ఒక్క మంత్రైనా రిజైన్ చేశారా? అని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరీక్షా పేపర్ లీకేజీ ఘటనలను వివరించారు. ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారని ఆయన మండిపడ్డారు.

ఇండియా అలియన్స్ లో ఎవరు ఎవరితో ఉన్నారో తెలియదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 53 సార్లు పేపర్ లీకేజీలు అయ్యాయని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో యూపీఏ హయాంలో 15 సార్లు పేపర్లు లీక్ అయ్యాయని విమర్శించారు. ఆ లీకేజీలు జరిగినప్పుడు ఆ విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. పేపర్ లీక్ అంశంపై రాద్ధాంతం చేస్తూ దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014 ముందు కాంగ్రెస్ హాయాంలోని పేపర్ లీకేజీ ఘటనలను రాంచందర్ రావు (Ramchander Rao) వివరించారు. పశ్చిమ బెంగాల్ టీఎంసీ పరిపాలనలో 7 పేపర్లు లీకేజీ అయ్యాయని తెలిపారు. తమిళనాడు ఏఐడీఎంకే హయాంలో 7 లీకేజీలు అయ్యాయి. ఒరిస్సాలోని బీజేడీ ప్రభుత్వ హయాంలో 6 పేపర్ లీకేజీ ఘటనలు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) హయాంలో 6 లీకేజీలు, ఉత్తర ప్రదేశ్ లోని ఎస్పీ పార్టీ హయాంలో 3, నాగాలాండ్ ఎన్పీఎఫ్ హయాంలో 3, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 లీకేజీలు, సిక్కింలో 2 లీకేజీలు జరిగాయని చెప్పుకొచ్చారు.

వెస్ట్ బెంగాల్‌లో సీపీఎం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 లీకేజీలు, ఝార్ఖండ్ లో జేఎంఎం పార్టీ హయాంలో 2 లీకేజీలు, తమిళనాడు డీఎంకే హయాంలో 2 లీకేజీలు, ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ యాయాంలో 1 లీకేజీ, ఎన్ పీపీ హయాంలో 1 లీకేజీ, మిజోరాంలో ఎమ్ఎన్ఎఫ్ హయాంలో 1 లీకేజీ, యునైటెడ్ ఫ్రంట్ ఫెడరేషన్ లో 1 లీకేజీ, నాగాలాండ్ డీఏఎన్ హయాంలో 1, ఢిల్లీలో ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు 1 పేపర్ లీకేజీ జరిగిందని తెలిపారు.

Read Also: భారత్‌ అల్లర్లపై షర్మిష్ఠ సంచలన జోస్యం.. నెట్టింట జోరుగా చర్చ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>