విచిత్ర ఘటన.. శివలింగంపై పోసిన నూనె పాలుగా మార్పు..!

కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటపల్లిలోని శివాలయంలో (Chittoor Shiva Temple) చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయంలోని శివలింగంపై నూనెతో అభిషేకం నిర్వహించగా, ఆ నూనె క్రమంగా పాల రంగులోకి మారుతున్నట్లు భక్తులు గుర్తించారు.

ఈ విషయం క్రమంగా పక్క గ్రామాలకు పొక్కడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివలింగంపై పోసిన నూనె తెల్లటి పాల రంగులోకి మారడాన్ని కొందరు భక్తులు దైవ మహిమగా భావిస్తున్నారు.

ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ఆలయానికి క్యూ కట్టారు. అయితే, ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూనెలోని కొన్ని రసాయనిక లక్షణాలు లేదా శివలింగం ఉపరితలంతో జరిగే రసాయన చర్య వల్లే రంగు మారి ఉండొచ్చని మరికొందరు చెబుతున్నారు.

Read Also: ఢిల్లీలో హై టెన్షన్.. ప్రధాని మోదీ పై రేణుకా చౌదరి ఫైర్..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>