తగ్గేదే లేదు.. కాక్రోచ్ పార్టీ మెరుపు ధర్నా

కలం, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) నిరసనలతో ఢిల్లీ హోరెత్తుతోంది. నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళనలు కొనసాగించిన కార్యకర్తలు.. మరోసారి మెరుపు ధర్నా చేపట్టారు. వారిని అక్కడి నుంచి తప్పించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాల్సిందేనని కార్యకర్తలు పట్టుబడుతున్నారు. అప్పటివరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. సీజేపీ ఆందోళనలతో మరోసారి పోలీసులు అలర్టయ్యారు. పార్లమెంట్ సహా జంతర్ మంతర్ వంటి కీలక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కేసులు నమోదు..

కాక్రోచ్ పార్టీ సోమవారం చేసిన ఆందోళనల్లో భాగంగా పలువురు కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆందోళనకారుల దాడుల్లో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయయని.. 20కి పైగా ప్రభుత్వ వాహనాలు ధ్వంసమైనట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు.

నిరసనకారులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినట్లు వివరించారు. ఇదిలా ఉంటే, కాక్రోచ్ పార్టీ (Cockroach Janata Party) ఆందోళనల ముసుగులో తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతున్నట్లు నిఘా విభాగాలు గుర్తించినట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. వీటి వెనుక పాకిస్థాన్ ఉండొచ్చేమోనని అనుమానిస్తున్నాయని రిపోర్ట్ చేశాయి.

Read Also: తెలంగాణకు ఐఐఎం : కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>