కలం, వెబ్‌డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) పార్లమెంట్ ముట్టడి చేస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ డిప్కే (Abhijeet Dipke)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నేడు పార్లమెంట్‌ను ముట్టడిస్తామని సీజేపీ ముందే ప్రకటించింది. ఉదయం నుంచి జంతర్ మంతర్, పార్లమెంట్ వద్ద సీజేపీ మద్దతుదారుల నిరసనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఆందోళనకారులు దాదాపు పార్లమెంట్ గేటు వరకు చేరుకున్నారు. పోలీసులు, భద్రతా దళాలు లాఠీ చార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. సీజేపీ ఆందోళనలకు సీపీఐ మద్దతు ప్రకటించింది. తాజాగా అభిజిత్ డిప్కేను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.
Read Also: మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారు: ఖర్గే
Follow Us On: Instagram

