తిట్లు, ఓట్లు రేవంత్‌రెడ్డికి తెలిసింది ఇదే.. కేటీఆర్ ఫైర్

కలం, వెబ్ డెస్క్: సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి కేవలం తిట్లు, ఓట్ల గురించే తెలుసని, ఆయన మాటలు కోటలు దాటుతున్నా పనులు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనూ వంద శాతం రుణమాఫీ అమలు కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి రైతులకు సకాలంలో యూరియా కూడా అందించలేకపోయిందని విమర్శించారు.

ఇదే సమయంలో కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డిపై (Pocharam Srinivas Reddy) మండిపడుతూ.. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాబోయే రోజుల్లో ఆయన్ను ఓడించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు.

Read Also: ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలిచే పంట ఇదే: మంత్రి తుమ్మల

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>