నాలుగు డోర్లు మూసేశారు: రాహుల్ గాంధీ

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం దేశ యువతకు సంబంధించి అత్యంత ముఖ్యమైన నాలుగు డోర్లు మూసేసిందని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. మొదటిది, తయారీ రంగం. చైనా వస్తువులను దేశమంతటా అమ్ముతున్నారు. మనం తయారు చేసినవి మాత్రం ఎక్కడా కనిపించకుండా తలుపు మూసేశారు.

బ్యాంక్ రుణం దొరకదు..

రెండోది, ఆవిష్కరణల రంగం. యువత ఏదైనా కొత్తగా ఆవిష్కరిద్దామని ప్రయత్నించి, అందుకోసం బ్యాంక్ రుణం కావాలంటే అసలే దొరకదు. ఎందుకంటే, దేశంలో నాలుగైదు పెద్ద కుటుంబాలే మొత్తం నిధులను పంచేసి బ్యాంకుల్లోకి వెళ్లకుండా డోర్లు మూసేశారని మండిపడ్డారు.

ఐటీ కొలువులు పోతున్నాయ్..

మూడోది, కార్పొరేట్ రంగం. ఏఐ రాకతో కార్పొరేట్ ఉద్యోగాలు మరీ ముఖ్యంగా ఐటీ కొలువులు పూర్తిగా తగ్గిపోవడంతో అక్కడ కూడా ప్రవేశించడానికి అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రైవేటీకరణతో ప్రభుత్వ ఉద్యోగాలు దూరం..

ఇక నాలుగోది, ప్రభుత్వ రంగ సంస్థలు. దేశ యువతకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఒక కల. ఆరు కోట్ల మంది వాటి తలుపు తట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, ప్రైవేటీకరణ చేసి ఆ రంగాన్ని కూడా పూర్తిగా మూసివేస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందని.. ఇటీవల కాలంలో జరిగిన ఘటనలే అందుకు ఉదహరణ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>