గ్రామ పంచాయతీలకు భారీ శుభవార్త

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (Telangana Cabinet) గ్రామ పంచాయతీలకు శుభవార్త చెప్పింది. ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి స్థానికంగా వనరులను ఉపయోగించుకుని పంచాయతీలే సొంతంగా నిధులు సమీకరించుకోవచ్చు. దీనిలో ప్రభుత్వ జోక్యం ఏమీ ఉండబోదు. అలాగే ఈ భేటీలో మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

పాలమూరు ప్రాజెక్టుపై కీలక నిర్ణయం..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ అంచనాల పెంపునకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా శాఖలో పోస్టుల భర్తీకి అనుమతించింది. అలాగే, బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్‌లో మార్పులు చేర్పులకు అంగీకరించింది. సంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెంపునకు ఓకే చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>