కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కాన్వాయ్‌కు ప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపింది. బండి సంజయ్ శుక్రవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. గంభీరావుపేటకు వెళ్తున్న క్రమంలో ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ సమీపంలో కాన్వాయ్‌లోని వాహనాలు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. దీంతో పలు కార్ల ముందు, వెనుక భాగాలు ధ్వంసమయ్యాయి. అయితే బండి సంజయ్ ఉన్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాగే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపు వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
Read Also : వింతైన టైటిల్.. క్యూరియాసిటీ పెంచిన ‘పళ్ళబురుసు’
Follow Us On : WhatsApp

