సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లు నమోదు కావాలి: నిరంజన్ రెడ్డి

కలం, వనపర్తి: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరు తుది జాబితాలో చోటు దక్కేలా బీఆర్‌ఎస్ శ్రేణులు చొరవ చూపాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి మండలంలోని చందాపూర్, దత్తాయిపల్లి, శ్రీనివాసపూర్, చిన్నగుంటపల్లి తదితర గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలతో పాటు పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగింపులో బీఆర్‌ఎస్ పార్టీ కీలకంగా కృషి చేసిందన్నారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాణిక్యం, రఘువర్ధన్ రెడ్డి, ధర్మానాయక్, మాధవ్ రెడ్డి, దేవర్ల నరసింహ, మహేశ్వర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>