ఏపీలో కరోనా కలకలం.. 4 మృతి, పలువురికి పాజిటివ్

కలం, వెబ్ డెస్క్: దేశంలో కొన్నాళ్లపాటు సైలంట్‌గా ఉన్న కరోనా (COVID Cases) మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. అక్కడక్కడా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. కానీ ఏపీలో మాత్రం వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన 20 రోజుల్లో రాష్ట్రంలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా కడపలో 8 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూశాయి.

ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ముగ్గురు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చేరి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 20 రోజుల్లో వైరస్ బారి నుంచి ముగ్గురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా (COVID Cases) మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ వైద్య శాఖ హెచ్చరిస్తోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచనలు చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>