తెలంగాణ టీ20పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ క్రీడాకారులకు తెలంగాణ టీ20 మంచి అవకాశమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. టీజీ20 లీగ్ తొలి సీజన్ విజేతగా హైదరాబాద్ ఈ–ఛాంపియన్స్ నిలిచిన విషయం తెలిసిందే. జట్టు ఆటగాళ్లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

క్రీడా పాలసీనే తీసుకొచ్చాం..

తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ పాలసీనే తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించే క్రీడాకారులకు భారీగా నగదు ప్రోత్సాహకంతో పాటు డీఎస్పీ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్లు వివరించారు. సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తి జీవాంజి వంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

గచ్చిబౌలి స్టేడియం మార్చేస్తాం..

గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసినట్లు వివరరించారు. ఏ రంగం ఎంచుకున్నా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయకపోతే విజయం సాధించలేమని క్రీడాకారులకు సూచించారు. తెలంగాణ టీ20లో సాధించిన విజయంతో రాష్ట్ర క్రీడాకారులు భారత జట్టులో కూడా ఆడాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>