పాల్వంచ రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) పట్టణ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణంలో బుధవారం రూ.1.73 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, డ్రైన్ల నిర్మాణంతో పాటు మొత్తం 10 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 31, 33, 34, 36, 38, 42, 45 డివిజన్‌లలో  మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో మురుగునీటి సమస్య పరిష్కారానికి డ్రైన్ల నిర్మాణం, రవాణా సౌకర్యాల మెరుగుదలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే (MLA Kunamneni) స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, పలువురు కార్పొరేటర్లు, సీపీఐ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read Also: విద్యా శాఖను అందుకే నా దగ్గ‌ర పెట్టుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>