కలం, వెబ్ డెస్క్ : ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందింది. ఇకపై గ్యాస్ సిలిండర్ కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సిలిండర్‌ను ఇంటి వద్దకు డెలివరీ (LPG Cylinder Delivery) చేయనున్నారు. కస్టమర్లకు వేగవంతమైన సేవలు అందించేందుకు చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) క్విక్ కామర్స్ (Quick Commerce) సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
ప్రముఖ ఆయిల్ కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL).. క్విక్ కామర్స్ ఫ్లాట్ ఫామ్ స్విగ్గీ ఇన్ స్టామార్ట్ (Swiggy Instamart) తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ సర్వీస్ ద్వారా ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది. మొదటి దశలో భాగంగా బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించారు.

