కలం, వెబ్ డెస్క్ : తమిళ సినీ హీరో ఆర్య (Actor Arya)తో పాటు ఆయన చిత్ర యూనిట్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ‘అనంతన్ కాడు’ సినిమా షూటింగ్ నిమిత్తం ఫిల్మ్ నగర్‌కు చెందిన ‘తాహెర్ సినీ టెక్నిక్’ అనే సంస్థ నుండి ఖరీదైన డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లను అద్దెకు తీసుకుని, దానికి సంబంధించిన రూ.1.80 కోట్ల బాకీని చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ సదరు సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ సొంత ఖర్చులతో ఈ పరికరాలను కేరళలోని షూటింగ్ స్పాట్‌కు పంపించామని, షూటింగ్ పూర్తయినప్పటికీ చిత్రబృందం బిల్లులు చెల్లించలేదని బాధితులు పేర్కొన్నారు. అంతేకాకుండా, బాకీ డబ్బుల కోసం వెళ్లిన తమ మేనేజర్‌ను హీరో ఆర్య (Actor Arya), ప్రొడ్యూసర్ వినోద్‌తో పాటు చిత్రబృందానికి చెందిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదులో వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు హీరో ఆర్య, ప్రొడ్యూసర్ వినోద్, చిత్ర యూనిట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: సీజనల్ వ్యాధుల బారిన పడొద్దంటే.. వర్షాకాలంలో తప్పక తినాల్సిన పండ్లు
Follow Us On : WhatsApp

