కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా నార్లపూర్ ప్రభుత్వ పాఠశాలలో పైకప్పు కూలిన ఘటన సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జిల్లాలో ఇలాంటి ఘటన సిగ్గుచేటని మండిపడ్డారు. ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావన్నారు.
ప్రభుత్వ స్కూళ్లపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థలోని ప్రభుత్వ పాఠశాల భవనాలను వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

