రెండో శనివారం స్పెషల్.. గురుకులాల్లో సంద‌డి!

క‌లం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలోని గురుకుల పాఠశాలలు (Gurukul Schools) రెండో శనివారంతో సంద‌డిగా మారాయి. హాస్ట‌ళ్ల‌లో ఉండే త‌మ పిల్ల‌ల‌ను కలిసేందుకు వ‌చ్చిన‌ తల్లిదండ్రులు పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపారు. ఉదయం నుంచే గురుకులాలకు చేరుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఆప్యాయంగా పలకరించి, ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనం, చిరుతిండ్లు అందించారు.

పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, వారి చదువు, ఆరోగ్యం, వసతి సౌకర్యాల గురించి ఆరా తీశారు. చిన్నారులు కూడా తల్లిదండ్రులను కలుసుకుని సంతోషం వ్య‌క్తం చేశారు. కొంతసేపు కుటుంబసభ్యులతో గడపడంతో గురుకుల ప్రాంగణాలు ఆప్యాయ అనుబంధాలకు వేదికగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>