కలం, వెబ్ డెస్క్: వియత్నాం (Vietnam)లో జరిగిన బోటు ప్రమాదం (Boat Accident)లో ఏపీ వాసులతో పాటు పలువురు తెలంగాణ, తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఎక్స్ వేదికగా ఓ కీలక పోస్టు చేసింది. ఫూ క్వాక్ దీవి సమీపంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుందని తెలిపింది. బాధిత కుటుంబాలకు సమాచారం, సహాయం అందించేందుకు హో చి మిన్ సిటీలోని ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించేందుకు మూడు నంబర్లను ప్రకటించింది. +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించింది. దీంతో పాటు హనోయ్‌లో కూడా మరో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనికి +84 91 308 9165 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ బోటు ప్రమాదంలో కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ మృతి మృతి చెందారు. జయశ్రీ భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఏపీకి చెందిన మరో నలుగురు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు రెస్క్యూ టీం 23 మందిని కాపాడినట్లు వెల్లడించిది. ఏపీకి చెందిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటి వరకు సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే మృతుల వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

