కలం, కరీంనగర్ బ్యూరో: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ సందర్భంగా కరీంనగర్ (Karimnagar) లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ (AISF), ఎస్ఎఫ్ఐ (SFI), పీడీఎస్‌యూ (PDSU) నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య నెట్టులాట జరగడంతో పోలీసులు బలవంతంగా విద్యార్థి నేతలను అరెస్టు చేశారు .
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విద్యాసంస్థల బంద్‌ను అడ్డుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను గాలికొదిలేసి మనవడితో పూరీలు చేస్తున్న రేవంత్ రెడ్డికి విద్యార్థి లోకం ఖచ్చితంగా బుద్ది చెబుతుందని హెచ్చరించారు. భవిష్యత్తులో విద్యార్థులు శాశ్వతంగా ఇంటికి పరిమితం చేస్తారని అన్నారు.

