Mobile Popup Ad
Mobile Popup Ad

మూసీలోకి హెరిటేజ్ వ్య‌ర్థాలు.. వైసీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ (Heritage)పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. మూసీ న‌దిలో హెరిటేజ్ వ్య‌ర్థాలు క‌లుపుతున్నారంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు చేసింది. శామీర్‌పేట్‌లోని జ‌గ‌ద్గిరిగుట్ట వ‌ద్ద ఉన్న హెరిటేజ్ సంస్థ నుంచి ప్ర‌తి రోజు రాత్రి స‌మ‌యంలో ఈ వ్య‌ర్థాల డంపింగ్ జ‌రుగుతోంద‌ని పేర్కొంది. రోజుకు సుమారు 50 వేల లీటర్ల స్కిమ్డ్ వేయ్ వ్యర్థాలు మూసీ నదిలోకి పారబోరుస్తున్నార‌ని ఆరోపించింది.

దీన్ని శ్రీ సహదేవ్‌సింగ్ నగర్ కాలనీ వాసులు అడ్డుకున్నార‌ని, దీంతో ఈ దారుణం వెలుగులోకి వ‌చ్చింద‌ని వెల్ల‌డించింది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను కూడా సోష‌ల్ మీడియాలో బ‌య‌ట‌పెట్టింది. పోస్టు చివ‌ర‌న ఏమిటిది చంద్ర‌బాబు అంటూ సీఎంను ఉద్దేశించి వ్యంగ్యంగా రాసుకొచ్చారు. మ‌రి దీనిపై హెరిటేజ్ సంస్థ నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>