ఆర్టీఏ చలాన్ లింక్ ఓపెన్.. అకౌంట్ నుంచి రూ.95 వేలు మాయం

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మజర్ అనే యువకుడు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ నెల 2న తన వాట్సప్ కు ఆర్టీఏ చలాన్ పేరుతో ఏపీకే లింక్ (RTA Challan Scam) వచ్చింది. అతను ఆ లింక్ ను క్లిక్ చేసి అందులో ఉన్న వివరాలు నమోదు చేశాడు. ఈనెల 3న మజర్ తన బ్యాంకు ఖాతాలో లక్ష జమ చేశాడు. ఈ నెల 6న విడతల వారీగా 15 నిమిషాల వ్యవధిలో 95 వేలు మాయమయ్యాయి. దీంతో బ్యాలెన్సు చూసుకోగా 95 వేలు డ్రా అయినట్లు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ఫిర్యాదు చేశాడు. అపరిచితులు పంపే లింకులను ఓపెన్ చేయవద్దని అకౌంట్ ఏటీఎమ్ పిన్ వివరాలు ఎవరికీ చెప్పకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

Read Also: సోష‌ల్ మీడియాలో న‌గ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌.. దోచుకెళ్లిన దొంగ‌లు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>