ఇండియాకెళ్లిపోదాం.. 40శాతం మంది ఇండో అమెరికన్ల ఆలోచన ఇదే!

కలం, వెబ్ డెస్క్: అమెరికాలో  జాబ్ చేయడం ఒకప్పటి కల. కానీ, ఇప్పుడు అక్కడ నివసిస్తున్న ఇండో అమెరికన్లలో (Indo American) దాదాపు 40 శాతం మంది ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని, తిరిగి భారత్‌కు వచ్చేయాలని ఆలోచిస్తున్నట్లు ఒక తాజా నివేదిక స్పష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో భారతీయులు అమెరికాపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. భారతీయ అమెరికన్ కమ్యూనిటీ (Indo American)పై నిర్వహించిన ఈ సర్వేలో.. అమెరికా వదిలి వెళ్లాలనుకోవడానికి ఇండియన్లు ప్రధానంగా 4 కారణాలు చెప్పారు.

  • అమెరికాలో ద్రవ్యోల్బణం కారణంగా ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, విద్య, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. తాము సంపాదిస్తున్న దానిలో ఎక్కువ భాగం కనీస అవసరాలకే సరిపోతోందని, పొదుపు చేయడం కష్టంగా మారిందని చాలామంది అభిప్రాయపడ్డారు.
  • ఇటీవలి కాలంలో అమెరికాలో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి, విద్వేషపూరిత దాడులు భారతీయులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై జరుగుతున్న వరుస దాడులు, జాతి వివక్ష వ్యాఖ్యలు తమ భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని వారు తెలిపారు.
  • దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నప్పటికీ.. గ్రీన్ కార్డ్ కోసం ఏండ్ల తరబడి వేచి చూడాల్సి రావడం భారతీయులను విసుగుకు గురి చేస్తోంది. ఈ అనిశ్చితి వల్ల తమ పిల్లల భవిష్యత్తు, కెరీర్ ప్రమాదంలో పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • మరోవైపు, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుండటం, ఇక్కడ స్టార్టప్ సంస్కృతి, టెక్నాలజీ రంగంలో మెరుగైన అవకాశాలు ఉండటం కూడా భారతీయులను ఆకర్షిస్తోంది. సొంత గడ్డపై, సొంత మనుషుల మధ్య ఉండటమే మేలని చాలామంది భావిస్తున్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>