కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టులోకి మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అడుగుపెట్టడంతో డ్రెస్సింగ్ రూమ్‌కు కొండంత బలమొచ్చింది. జట్టు అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా యువీ నియమితులైనట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చేరికతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ విభాగం మరింత బలంగా తయారైంది. ఈ నిర్ణయం వెనుక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించారు. స్వయంగా గంగూలీయే చర్చలు జరిపి యువీని జట్టులోకి తీసుకువచ్చారు.
వరల్డ్ కప్ విజేత అయిన యువరాజ్ రాకతో జట్టులో సరికొత్త ఉత్సాహం నిండిందని, ముఖ్యంగా ఆయన అనుభవం యంగ్ బ్యాటర్లకు ఎంతో తోడ్పడుతుందని గంగూలీ ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్, మిల్లర్, అక్షర్ పటేల్, నితీశ్ రాణా వంటి ఎడమచేతి వాటం బ్యాటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. యువీ మార్గదర్శకత్వంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ లైనప్‌కు తిరుగులేకుండా పోతుందని యాజమాన్యం భావిస్తోంది. అభిషేక్ శర్మ లాంటి యంగ్ స్టార్లను ఇప్పటికే తీర్చిదిద్దిన యువీ, ఇప్పుడు ఢిల్లీ కుర్రాళ్లను కూడా పవర్ హిట్టర్లుగా మారుస్తారని నమ్ముతున్నారు.

