ఆదిలాబాద్ క‌లెక్ట‌రేట్‌లో బ‌తుక‌మ్మ వేడుక‌లు!

కలం, ఆదిలాబాద్: పండుగలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలతో వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పూలను దైవంగా భావించి పూజించే అద్భుతమైన సాంస్కృతిక సంప్రదాయం మన బతుకమ్మ సొంతమన్నారు.

పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రజలందరూ ఈ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారని కొనియాడారు. జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో ఇలాంటి సాంస్కృతిక వేడుకలను మున్ముందు మరింత ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. అనంతరం మహిళలతో కలిసి అతిథులు ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ సంబురాల్లో మునిగిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>