కలం, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind)కు కేజీఎఫ్ స్టార్ యశ్ తల్లి (Yash Mother) పుష్ప అరుణ్ కుమార్ (Pushpa Arun Kumar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అల్లు అరవింద్ యశ్ స్టార్‌డమ్ గురించి చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. టాక్సిక్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వస్తున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. యశ్ ఎదుగుదలను కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారని పుష్ప అన్నారు. కేజీఎఫ్ సినిమా కంటే ముందే యశ్ కర్ణాటకలో ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్‌లో నటించాడని తెలిపారు. కేజీఎఫ్ ముందు ఇండస్ట్రీకి వరుసగా ఐదు హిట్లు అందించాడని చెప్పారు.
యశ్ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చి, తన కష్టంతో సక్సెస్ అయ్యాడని పుష్ప తెలిపారు. ఒక సాధారణ డ్రైవర్ కొడుకు విజయాన్ని చూసి కొందరు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్ కెరీర్‌ను దెబ్బ తీయాలని చూస్తున్నారని చెప్పారు. ప్రేక్షకులకు తన కొడుకుపై ప్రేమ ఉన్నంత వరకూ అతడిని ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. అయితే పుష్ప ఎక్కడా అల్లు అరవింద్ పేరు ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ, ఆమె అల్లు అరవింద్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అల్లు అరవింద్ గతంలో యశ్ గురించి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కారణం.
ఇంతకీ అల్లు అరవింద్ ఏమన్నారంటే..?
అల్లు అరవింద్ గతంలో ఓ వేదికపై పాన్ ఇండియా సినిమాలు, హీరోల స్టార్‌డమ్ గురించి మాట్లాడుతూ.. తనకు కేజీఎఫ్‌కు ముందు యశ్ ఎవరో తెలియదని, సినిమాను భారీ బడ్జెట్‌తో గొప్పగా చూపించేసరికి హిట్ అయ్యి, ఆ హీరోకు కూడా స్టార్ డమ్ వచ్చిందనే కోణంలో వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు యశ్ కూడా గతంలో ఈ వ్యాఖ్యలపై స్పందించారు. సినిమా ఎంత గొప్పగా తీసినా నటీనటుల పని తీరు సరిగా లేకపోతే విజయం సాధించలేమని చెప్పారు.

